వైఎస్ఆర్ ‘యాత్ర’ రేపటి నుంచే ప్రారంభం..

270
Mammootty-Yatra-Movie
- Advertisement -

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ కి ఆనందో బ్రహ్మా డైరెక్టర్ మహి.వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముటి నటిస్తున్నారు. వైఎస్ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువయిన నేపథ్యంలో యాత్ర అనే టైటిల్ ని ఖరారు చేసి, పోస్టర్ విడుదల చేశారు. రాజశేఖర్ రెడ్డి యాత్ర సమయంలో ఎదుర్కొన్న పరిస్థుతులను ఈ బయోపిక్ లో చూపించనున్నారు.

ysr-biopic

ఈ పోస్టర్ తో ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి చేయనున్నారని సమాచారం.

ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య పాత్రలో ‘బాహుబలి’ ఫేమ్ ఆశ్రిత వేముగంటి .. సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక వైఎస్ జగన్ మోసన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు సూర్య నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరు ఏ పాత్రలలో నటించనున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

యాత్ర ఫస్ట్ లుక్..

- Advertisement -