బీజేపీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది:షర్మిల

3
- Advertisement -

నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీటులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. బ్రష్ట్ జుమ్లా పార్టీ బీజేపీకి కాంగ్రెస్ అంటే భయం పట్టుకుంది అని మండిపడ్డారు.

దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను జీర్ణించుకోలేక పోతోందని.. అందుకే CBI, EDలను సొంత ఏజెన్సీలుగా వాడుకుంటూ ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తోంది అని మండిపడ్డారు షర్మిల.

కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని అణగదొక్కాలని చూస్తోందని… ప్రశ్నించే గొంతును నొక్కాలని కుట్రలు చేస్తోంది అని దుయ్యబట్టారు. బీజేపీ చేస్తున్న నీచ రాజకీయాలకు, ప్రతీకార చర్యలకు ఇది నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:సుప్రీంలో కంచె గచ్చిబౌలి భూములపై విచారణ

- Advertisement -