ఏపీలో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు నిలిచిపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. పేరుకు రైజింగ్ స్టేట్.. కానీ వైద్య సేవలకు దిక్కులేదు అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదు.. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు.ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు.. ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.
పేరుకు రైజింగ్ స్టేట్..కానీ వైద్య సేవలకు దిక్కులేదు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం. ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు. గత 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా…
— YS Sharmila (@realyssharmila) April 7, 2025
Also Read:ఒకే ఏడాదిలో దెబ్బతీశారు: హరీష్ రావు

