- Advertisement -
సార్వత్రిక ఎన్నికల సమరం ముగియడంతో పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ని కలిసిన షర్మిల..పార్టీలో అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కొత్త కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఇక సొంతపార్టీలోని నాయకుల నుండే తనపై విమర్శలు వస్తుండగా వాటిని సైతం అధిష్టానానికి వివరించారు. కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిలతో సహా పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్దులు ఎవరూ విజయం సాధించలేదు. తన ఓటమికి కారణం ప్రచారానికి సరైన సమయం లేకపోవటమేనని అధిష్టానానికి తెలిపారు.
అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ,పవన్ ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని కోరారు. త్వరలోనే కొత్త కమిటీలను ఏర్పాటు చేసి సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చారు.
Also Read:KTR:మహామనిషి…జయశంకర్ సార్
- Advertisement -