YS Sharmila:ఏపీకి షర్మిల.. కానీ కండిషన్?

30
- Advertisement -

ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ షర్మిల గూర్చి రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందని, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని, తెలంగాణ పాలిటిక్స్ కు ఆమె గుడ్ బై చెప్పినట్లేనని.. ఈ రకమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తల్లో దేనిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా ఎన్నికల రేస్ నుంచి తప్పుకొని కాంగ్రెస్ కు ప్రత్యక్ష మద్దతు పలికింది షర్మిల. అంతకుముందు పార్టీ విలీనం కోసం పాలేరు టికెట్ కోసం షర్మిల ప్రయత్నం చేసినప్పటికీ అవేవీ కుదరలేదు. దాంతో మద్దతుతోనే సరిపెట్టుకొని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరమైంది. ఇక మరో మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. .

ఈ నేపథ్యంలో షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకునే ఆలోచనలో ఉందట కాంగ్రెస్ అధిస్థానం. తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి ఏపీలో మాత్రం ఆ పార్టీకి ఏమాత్రం బలంలేదు. అందువల్ల ఏపీలో కాంగ్రెస్ బలపడాలంటే కాంగ్రెస్ తరుపున షర్మిలను రంగంలోకి దించితే పార్టీకి మైలేజ్ వస్తుందనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు టాక్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా షర్మిల రాకను స్వాగతించడం గమనార్హం. అయితే ఏపీలో కాంగ్రెస్ తరుపున బాధ్యత వహించేందుకు షర్మిల కాంగ్రెస్ అధిష్టానం ముందు ఓ కండిషన్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

తెలంగాణలో లోక్ సభ సీటు కేటాయిస్తే ఏపీలో కాంగ్రెస్ కు బాధ్యత వహిస్తానని డిమాండ్ చేస్తున్నారట షర్మిల. దాంతో షర్మిల కండిషన్ ను అధిష్ఠానం హోల్డ్ లో పెట్టినట్లు వినికిడి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి లోక్ సభ సీటు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో షర్మిలకు సీటు కేటాయిస్తే పార్టీలో అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది. మరి ఏపీలో బలపడేందుకు షర్మిలను రంగంలోకి దించాలని చూస్తున్న కాంగ్రెస్.. ఆమె కండిషన్స్ కు ఒకే చెబుతుందో లేదో చూడాలి.

Also Read:రైతుబంధు ఇప్పట్లో లేనట్లే..?

- Advertisement -