క్రికెటర్లు, సినిమా హీరొయిన్లు ప్రేమలో పడటం సర్వ సాధారణమే. కొంత మంది ప్రేమ పేరుతో చట్టా పట్టాలేసుకుని తిరుగుతారు. మరికొంత మంది వివాహం కూడా చేసుకున్న వాళ్లు ఉన్నారు. చాలా మంది హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమాయణం నడుపుతున్నారు. తాజగా ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి , బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో కూడా చాలా మంది ప్లేయర్లు బాలీవుడ్ హీరోయిన్ లతో ప్రేమలో పడ్డారు. ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ , ప్రితిజింతాలు కూడా గతంలో ప్రేమించుకున్నారు.
తాజగా మరో క్రికెటర్ కూడా ఈలిస్ట్ లో చేరాడని సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. కే.ఎల్ రాహుల్ , నటి నిధి అగర్వాల్ కూడా డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరగుతుంది. విరిద్దరూ కలిసి కొన్ని ఫంక్షన్ లకు వెళుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక మరో ప్లేయర్ కూడా ఓ స్టార్ హీరో కూతురితో ప్రేమలో పడినట్టు బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విరిద్దరూ కలిసి తరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి.
ప్రముఖ సినీ నటుడు , కోల్ కత్తా నైట్ రైడర్స్ అధినేత షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఇండియా యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. విరిద్దరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజులుగా విరిద్దరు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని సమాచారం. ఇటివలే జరిగిన పలు పార్టీలకు కూడా ఇద్దరు కలిసి హాజరయినట్టు తెలుస్తుంది. మొన్న జరిగిన ఐపిఎల్ లో శుభ్ మాన్ గిల్ కోల్ కత్తా టీం లో ఆడిన విషయం తెలిసిందే. ఇటివలే సుహానా ఖాన్ తన 18 పుట్టినరోజును జరుపుకోగా ఆ ఫంక్షన్ కు శుభ్ మాన్ గిల్ కూడా హాజరయ్యినట్టు సమాచారం. వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకూ వెళ్తుందోలేదో చూడాలి మరి.