గోరంట్లకు సీటు.. డౌటే ?

22
- Advertisement -

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను జగన్ పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నాడా ? ఈసారి ఆయనకు సీటు కేటాయిస్తే వైసీపీకి ఇబ్బందే అని భావిస్తున్నారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. న్యూడ్ వీడియో కాల్ తో గోరంట్ల దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన సంగతి విధితమే. ఒక గౌరవ ఎంపీ స్థానంలో ఉన్న గోరంట్ల మాధవ్ ఆ మధ్య మహిళలను కించపరిచేలా న్యూడ్ వీడియో కాల్ లో మాట్లాడడం పెను దుమారం రేగింది. ఈ విషయంలో ఆయనపై మహిళా సంఘాలు, దేశ ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్లు వినిపించాయి. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఆయనపై ఎలాంటి వేటు వేయలేదు. దాంతో జగన్ వైఖరి పై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమౌతు వచ్చాయి.

అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీట్ల కేటాయింపుపై జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ ఇంచార్జ్ లను మారుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి మాయని మచ్చ తీసుకొచ్చిన గోరంట్ల విషయంలో జగన్ ఏం ఆలోచిస్తున్నారానే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే తనకు సీటు కేటాయింపుపై తాజాగా గోరంట్ల మాధవ్ నోరు విప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ తనకు సీటు కేటాయింపుపై అధినేత జగన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన చెపుకొచ్చారు. అంతే కాకుండా తనకు సీటు ఇచ్చిన ఇవ్వకపోయిన పార్టీ కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో గోరంట్లకు ఈసారి సీటు డౌటే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆయనకు సీటు కేటాయిస్తే మరింత నెగిటివిటీ పెరిగే అవకాశం ఉందని వైసీపీలోని ఓ వర్గం భావిస్తోందట. అందుకే ఈసారి గోరంట్లకు ఏ ఎన్నికల్లోనూ సీటు ఇచ్చే ఆలోచనలో జగన్ లేరని తెలుస్తోంది.

Also Read:కేవలం ప్రచారం కోసమే మేడిగడ్డ సందర్శన

- Advertisement -