వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

313
Kadubandi Srinivasa Rao
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. సామన్యుల నుంచి ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకు చాలా మంది రాజకీయ నాయకులు కరోనా సోకింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ఎమ్మెల్యేకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కడుబండి శ్రీనివాసరావుకు వైరస్ పాజిటివ్ వచ్చింది. గత రెండు మూడు రోజులగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది.

దీంతో అతడిని చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ఓ గెస్ట్ హౌస్ కు తరలించారు. అనుమానంతో అతడి గన్ మెన్ కూడా చికిత్స చేసుకొగా అతనికి కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేసి కరోనా టెస్ట్ లు నిర్వహించారు.కాగా కొద్దిరోజుల క్రితం కడుబండి శ్రీనివాస్ రావు అమెరికాకు వెళ్లి వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే టెస్ట్ లు చేయగా నెగిటివ్ అని తేలింది. ఇటివలే ఆయన అసెంబ్లీకి కూడా వెళ్లారు. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ లో పాల్గోన్నారు. అసెంబ్లీలో ఆయన చాల మంది ఎమ్మెల్యేలను కలిశారు. దీంతో ఇప్పుడు వైసిపి వర్గాల్లో టెన్షన్ గా మారింది.

- Advertisement -