స్లిమ్ గా మారిన లేడీ కమెడియన్

564
comedian
- Advertisement -

కరోనా నేపథ్యంలో సినీ స్టార్స్ తమ ఫిట్ నెస్‌కు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారు. అందాల నటి కుష్బూ 15 కిలోలు తగ్గి స్లిమ్‌గా మారగా తాజాగా లేడి కమెడియన్‌ విద్యుల్లేఖ కూడా స్లిమ్‌గా మారిపోయారు.

తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో మంచి గుర్తింపు సాధించింది విద్యుల్లేఖ. బొద్దయిన ఆమె రూపం.. ఫన్నీగా అనిపించే హావభావాలు.. తమిళ యాసతో సాగే ఆమె డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి. ముఖ్యంగా రన్ రాజా రన్, రాజు గారి గది, సరైనోడు లాంటి సినిమాల్లో విద్యుల్లేఖ తన నటనతో ఇంప్రెస్ చేసింది.

బుద్దుగా లావుగా ఉండే విద్యుల్లేఖ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. స్లిమ్‌గా మారిన విద్యుల్లేఖ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి స్లిమ్‌గా మారిన విద్యుల్లేఖకు ఇప్పుడు ఏ మేరకు అవకాశాలు కలిసివస్తాయో వేచిచూడాలి.

- Advertisement -