నల్లబెల్లిలో యశోద సేవా కేంద్రం…

116
sudarshan reddy
- Advertisement -

1 కోటి 50 లక్షల వ్యయంతో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం “మేడిపల్లి – రాంపూర్” గ్రామంలో “యశోద సేవా కేంద్రం” – ‘ఉచిత మెగా ఫంక్షన్ హాల్ & స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కాంప్లెక్స్’ ను ప్రజలకు, యువతకు, పూర్తి ఉచితంగా నిర్మించి ఇచ్చింది హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ గ్రూప్ కు చెందిన యశోద చారిటబుల్ ఫౌండేషన్. యశోద ఛారిటబుల్ ఫౌండేషన్ నిర్మించిన మెగా ఫంక్షన్ హాల్& స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కాంప్లెక్స్” ను ఈరోజు ప్రారంభించారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

హైదరాబాద్, డిసెంబర్ 22, 2021: హైదరాబాద్ లోని ప్రముఖ యశోద గ్రూపు ఆస్పత్రుల సామాజిక సేవా(సి.ఎస్.ఆర్.) విభాగమైన యశోద ఛారిటబుల్ ఫౌండేషన్ తన సేవాకార్యక్రమాలలో ఓ ప్రధాన మైలురాయిని చేరుకున్న విషయం మీతో పంచుకోవటానికి సంతోషిస్తున్నాం.  యశోద ఛారిటబుల్ ఫౌండేషన్ (వై.సి.ఎఫ్.) తన సేవాకార్యక్రమాలకు కొనసాగింపుగా ఈరోజు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లోని మేడిపల్లి – రాంపూర్ గ్రామాలలో యశోద ఛారిటబుల్ ఫౌండేషన్ నిర్మించిన “యశోద సేవా కేంద్రం” – మెగా ఫంక్షన్ హాల్& స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కాంప్లెక్స్ ను నర్సంపేట్ MLA శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంబించారు. పూర్తి ఉచితంగా గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల వారికి, కమ్యూనిటీలకు, నిరుద్యోగులు, అనాథలు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంకోసం కోసం ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.
  
ఈ సందర్బంగా MLA శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… యశోద ఛారిటబుల్ ఫౌండేషన్ ఎందరో అనాథ మరియు నిరుపేద యువతకు అండగా నిలిచి వారికి అవసరమైన వృత్తిపరమైన – సామాజిక నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చి వారు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి ఈ కేంద్రం చాలా దోహదపడుతుందని అన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లోని మేడిపల్లి – రాంపూర్ గ్రామాల అభివృద్ధిలో భాగంగా యశోద ఛారిటబుల్ ఫౌండేషన్ 1.50 కోట్ల ఖర్చుతో ప్రజలకు మెగా ఫంక్షన్ హాల్, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కాంప్లెక్స్ ను నిర్మించి మేడిపల్లి – రాంపల్లి గ్రామాలప్రజలకు పూర్తి ఉచితంగా అందించడం నిజంగా హర్శించదగ్గ విషయమని MLA శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు యశోద హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గోరుకంటి దేవేందర్ రావుగారు, నర్సంపేట్ MLA శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -