టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం యశోద. దీన్ని హరి హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ థ్రిల్లర్ నేఫథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంకు సంబంధించిన సస్పెన్స్‌కు తెరదించుతూ అప్‌డేట్ ఇచ్చేశారు మేకర్స్.
ఈ చిత్రాన్ని నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. WWW.YASHODA.MOVIEలోకి లాగిన్ అయితే యశోద విడుదల తేదీపై క్లారిటీ వస్తుందని కూడా తెలియజేశారు.
సమంత డిఫరెంట్ షేడ్స్ లో ఉన్న లుక్స్‌తో డిజైన్ చేయబడిన తాజా పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. యశోద చిత్రంలో రావు రమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్నఈ సినిమాని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. యశోద చిత్రంలో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.