- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ వారి క్షేత్రం లో జూన్ 8 నుంచి భక్తుల దర్శనాలను పునః ప్రారంభం చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు…కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి 22 న ప్రభుత్వం యాదాద్రి లో భక్తుల దర్శలను నిషేధించింది. కేవలం స్వామి వారి ఏకాంత సేవలను, నిత్య కాంకిర్యలను మాత్రమే ప్రతి రోజు నిర్వహిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో మినహాయింపు లు ఇస్తూ జూన్8 నుంచి ఆలయాలను, ప్రార్ధన మందిరాలను తెరచుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయంలో కూడా భక్తుల దర్శలను ప్రారంభించేలా చర్యలు చేపట్టింది.
భక్తులు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక క్యూ లైన్ లను ,దర్శనం లైన్ లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క భక్తుడికి స్క్రీనింగ్ టెస్ట్ లు చేసిన తర్వాతే ఆలయం లోపలికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
- Advertisement -