ఇండియన్‌ ఎంబసీ..గాంధీ విగ్రహాం ధ్వంసం

273
amercia
- Advertisement -

ఆఫ్రికన్‌ – అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జార్జి కుటుంబానికి న్యాయం జరగాలని, అతడి హత్యకు కారకులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన కారులు ఆందోళన చేస్తుండగా ఈ నిరసనల్లో పలువురు సెలబ్రిటీలు, పాప్ సింగర్లు, మోడల్స్ కూడా పాల్గొన్నారు.

తాజాగా వాషింగ్ట‌న్ డీసీలోని ఇండియ‌న్ ఎంబ‌సీలో ఉన్న గాంధీ విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు నిరసన కారులు. గాంధీ విగ్ర‌హం ధ్వంసం ఘ‌ట‌న‌పై వాషింగ్ట‌న్ పార్క్ పోలీసులు విచార‌ణ మొద‌లుపెట్టారు.

ఆందోళ‌న‌కారులు హింసాత్మ‌క బాట ప‌ట్ట‌డంతో.. వారిని ట్రంప్ త‌న‌దైన స్ట‌యిల్‌లో హెచ్చ‌రించారు. ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను శాంతియుతంగా చేయ‌కుంటే ఆర్మీని రంగంలోకి దింప‌నున్న‌ట్లు హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ఫ్లాయిడ్ మృతికి కారణమైన పోలీసు ఆఫీస‌ర్ డెరిక్ చౌవిన్‌తో పాటు ఇత‌ర పోలీసుల‌పైనా కేసులు న‌మోదు అయ్యాయి.

- Advertisement -