కరోనా …అప్ డేట్స్

80
corona

ప్రపంచంలో ఇప్పటివరకు 26 లక్షల 21 వేల 436 మందికి కరోనావైరస్ సోకింది.లక్షా 82 వేల 989 మంది మరణించారు. ఏడు లక్షల 14 వేల 319 మంది కోలుకున్నారు.

భారత్‌లో ఇప్పటివరకు 20,471 కేసులు నమోదుకాగా 652 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసులు 943కు చేరుకున్నాయి. బుధవారం 15 కొత్త కేసులు నమోదుకాగా ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 10,సూర్యాపేటలో 3,గద్వాల్‌లో 2 కేసులు ఉన్నాయి. రానున్న రోజుల్లో కేసులు తగ్గుముఖం పడతాయని ప్రజలంతా లాక్ డౌన్‌కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్.

అమెరికాలో 835,316 కేసులు నమోదుకాగా 46,079 మంది మృతిచెందారు స్పెయిన్‌లో 208,389 కేసులు, 21,717 మరణాలు సంభవించాయి. ఇటలీ – 187,327 కేసులు నమోదుకాగా 25,085 మంది మృతిచెందారు.