మహిళల్లో చాలామందిని వేధించే సమస్య థైరాయిడ్. మన శరీరంలో ఉన్న ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటి.. ఈ గ్రంథి మన శారీరక ఎదుగుదలలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ గ్రంథిలో ఏర్పడే అసమతుల్యత కారణంగా థైరాయిడ్ సమస్యలు పెరుగుతాయి.
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ వ్యాధుల బారిన పడుతున్నారు. 2007లో థైరాయిడ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ రోజును మొదట ప్రతిపాదించారు. యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ స్థాపించబడిన తేదీగా ప్రతి సంవత్సరం మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని పాటించాలని సమావేశంలో నిర్ణయించారు.
Also Read:ఈటెల అసంతృప్తి.. హైకమాండ్ కు నష్టమే !
థైరాయిడ్ సమస్యను తెలిపే ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఏమిటో చూద్దాం. అలసటగా వుంటుంది. బరువు పెరుగుతారు లేదంటే బరువు తగ్గడం ఉంటుంది. హృదయ స్పందన కాస్త మందగమనంగా లేదా హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఆందోళన, చిరాకు, భయాన్ని ప్రదర్శిస్తుంటారు.నిద్రలేమి, కండరాల బలహీనత, వణుకు ఉంటుంది. మెడ నొప్పి, గొంతు నొప్పి, జ్వరం, చలి మరియు లేత థైరాయిడ్ సమస్య కలిగి ఉండవచ్చు.
థైరాయిడ్‌కు వీటితో కాస్త రిలీఫ్ ఉంటుంది. అయోడిన్-రిచ్ ఫుడ్స్ తీసుకుంటుండాలి. సముద్రపు చేపలు, రొయ్యలు, పెరుగు, పాలు, జున్నుతో సహా పాల ఉత్పత్తులు తీసుకోవాలి. థైరాయిడ్ వ్యాధికి యాంటీ థైరాయిడ్ మందులు, రేడియోధార్మిక అయోడిన్, బీటా బ్లాకర్స్ మరియు సర్జరీ వంటి వివిధ చికిత్సలు ఉన్నాయి.
Also Read:పుష్ప2 రిలీజ్ ఎప్పుడంటే..?