పుష్ప2 రిలీజ్ ఎప్పుడంటే..?

27
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పుష్ప‌2 చిత్రాన్ని యావ‌త్ భార‌తదేశం అంతా ప్రమోట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ ను అండ్ ప్రమోషన్స్ కి ముహూర్తం ఖరారు చేశారు. ‘పుష్ప2’ సినిమా డిసెంబరులో విడుదల కానున్నట్లు నిర్మాత బన్నీ వాస్ తాజాగా వెల్లడించారు. ఈ సినిమా అనంతరం వెంటనే గీతా ఆర్ట్స్‌ లో బన్నీ మరో సినిమా చేయనున్నారట. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించనున్నారని, నిర్మాణ బాధ్యతల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా పాలు పంచుకోనుందని తెలుస్తోంది.

బన్నీ – త్రివిక్రమ్ సినిమా 2024 నుంచి ఈ చిత్రం పట్టాలకెక్కున్నట్లు టాక్. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాలో అల్లు అర్జున్ కేమియో రోల్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే బన్నీ ఈ సినిమాలో యాక్ట్ చేయట్లేదు. ప్రస్తుతం బన్నీ ఫుల్ ఫోకస్ మొత్తం పుష్ప 2 పైనే ఉంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలే ఉన్నాయి. బన్నీ కూడా ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు.

Also Read: ఆదిపురుష్ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లాక్

ఇక పుష్ప 2 పై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. పుష్ప 2 యాక్షన్ ఎంటర్ టైనర్ అని కొందరు.. కాదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మరి కొంతమంది అంటున్నారు. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లోని ఫ్యాక్షన్ గొడవలని టచ్ చేస్తూనే రమణ మహర్షి భావాలను కూడా బన్నీ పాత్రలో సుకుమార్ జోడించాడు. ఈ కోణంలో కొత్తగా కథలో కొన్ని మార్పులు కూడా చేశారట. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక జంట‌గా నటిస్తోంది.

Also Read: రానా తేజ కాంబోలో మరో సినిమా..!

- Advertisement -