ఈటెల అసంతృప్తి.. హైకమాండ్ కు నష్టమే !

49
- Advertisement -

ఈటెల రాజేంద్ర బి‌ఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన తరువాత తన స్థాయికి తగ్గ ప్రాదాన్యత లభించలేదనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. బి‌ఆర్‌ఎస్ లో ఉన్నప్పుడూ ఈటెల రాజేంద్ర కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే వారు కే‌సి‌ఆర్. ఈటెలకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం, ఆయన సూచనలు, సలహాలు ఎంతో విలువైనవని ఇప్పటికి కూడా చెబుతుంటారు ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్. మరి అలాంటి నాయకుడికి బీజేపీలో చేరిన తరువాత అసలు ప్రాదాన్యమే లేకుండా పోయింది. కాషాయ పార్టీలో చేరిన మొదట్లో ఈటెలకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని భావించరంతా. అయితే ఎవరు ఊహించని విధంగా ఆయనకు చేరికల కమిటీ చైర్మెన్ పదవి అప్పగించారు.

ఈ పదవి పై ఈటెల కూడా అసంతృప్తిగా ఉన్నారని మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ క్యాంపైనర్ బాద్యతలు కావాలని ఈటెల డిమాండ్ చేసినప్పటికీ అధిష్టానం మాత్రం ఈటెల డిమాండ్ ను పెడచెవిన పెట్టిందట. అప్పటి నుంచి బీజేపీలో సరైన ప్రాధాన్యం లభించడం లేదని ఈటెల పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే తాను పార్టీ మారడం లేదని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నప్పటికి ఈ రకమైన వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉంచితే ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమి చవిచూసింది. దాంతో ఆ ప్రభావం తెలంగాణపై కూడా పడే అవకాశం ఉందని భావించిన బీజేపీ హైకమాండ్ పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టిందట.

Also Read: మోడీతో జగన్ దోస్తీ.. ఒప్పందం కుదిరిందా?

అందులో భాగంగానే తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాద్యతలు బండి సంజయ్ నుంచి ఈటెల రాజేంద్ర వైపు షిఫ్ట్ చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అధ్యక్ష పదవి మార్పు ఉండదని ఈటెల ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేశారు. కాగా తను ఎలాంటి పదవులు ఆశించనని పార్టీ కొరకు పని చేస్తానని చెబుతున్న ఈటెల.. ప్రస్తుతం నిర్వహిస్తున్న చేరికల కమిటీ చైర్మెన్ పదవి విషయంలో అసంతృప్తిగానే ఉన్నారనేది బలంగా వినిపిస్తున్న మాట. అయితే బలమైన నేతగా ఉన్న ఈటెల అసంతృప్తి.. ముందు రోజుల్లో పార్టీకి నష్టమే అని భావించిన అధిష్టానం ఆయనకు మరో పదవి కట్టబెట్టేందుకు సిద్దమతున్నట్లు టాక్. మరి ఈటెల రాజేంద్రకు బీజేపీ అధిష్టానం ఎలాంటి పదవి కట్టబెడుతుందో చూడాలి.

Also Read: నూతన పార్లమెంట్‌ ఓపెనింగ్‌కు విపక్షాలు బాయ్‌కట్‌

- Advertisement -