TTD:అత్యాధునిక టెక్నాలజీతో భద్రతా

5
- Advertisement -

తిరుమలలో భద్రతాపరమైన అంశాలపై రెండో రోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీ, బాడీ స్కానర్స్ వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 ను పరిశీలించారు.

కమాండ్ కంట్రోల్ రూమ్ లో తిరుమలలో సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని పరిశీలించారు. కోవిడ్ అనంతరం తిరుమలకు యాత్రికులు పెరగడం, వాహనాల రద్దీ పెరగడంతో భద్రతను ఎలా పెంచాలనే విషయమై చర్చించారు. తిరుమలకు పటిష్టమైన భద్రత కోసం అన్ని దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని హరీష్ కుమార్ తెలిపారు.

Also Read:ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవం..

అలిపిరి సప్తగిరి టోల్‌గేట్ దగ్గర టీటీడీ ఉద్యోగులను, కూరగాయల వాహనాలను, కార్గో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని.. ఆ తర్వాతనే తిరుమలకు అనుమతించాలని తెలిపారు. అప్పుడే నిషేధిత వస్తువులను అరికట్టగలమన్నారు. తిరుమలలో శాంతి భద్రతల కోసం క్రైమ్ పార్టీ, ఐడి పార్టీలను బృందాలుగా ఏర్పాటు చేసి ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతంతో కట్టడి చేస్తున్నామన్నారు.

Also Read:ఈటెల అసంతృప్తి.. హైకమాండ్ కు నష్టమే !

- Advertisement -