రివ్యూ: వరల్డ్ ఫేమస్ లవర్

3457
vijay devarakonda
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. వాలెంటైన్స్ డే సందర్భంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మించారు. విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే హీరోయిన్లుగా నటించగా ఈ మూవీతో విజయ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం..

కథ:

గౌతమ్ (విజయ్ దేవరకొండ) రైటర్ అవ్వాలన్న తన కల కోసం చేస్తున్న జాబ్ ను కూడా మానుకుంటాడు. తన కలను నెరవేర్చుకునే పనిలో భాగంగా తన లవర్ యామిని (రాశి ఖన్నా)ను పట్టించుకోవడం మానేస్తాడు. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. యామినితో బ్రేకప్‌ తర్వాత కథలు రాయడం మొదలుపెడతాడు. యల్లందు అనే పల్లెటూరులో ఒక మధ్య తరగతి ప్రేమకథ. ప్యారిస్ లో ఒక న్యూ ఏజ్ ప్రేమ కథ.. ఇలా భిన్నమైన ప్రేమకథలు రాస్తాడు. నేపధ్యాలు భిన్నవైనా ఆ ప్రేమకథలు ఏ తీరానికి చేరాయి. తన నిజజీవితంలో యామినితో ప్రేమకథ చివరికి ఎలా ముగిసింది అన్నదే వరల్డ్ ఫేమస్ లవర్ కథ.

Image result for world famous lover

ప్లస్ పాయింట్స్‌ :

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్‌ విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేశ్, సీనయ్య-సువర్ణ ట్రాక్. మూడు డిఫరెంట్ పాత్రల్లో గౌతమ్(రచయిత),సీనయ్య(కార్మిక లీడర్‌),గౌతమ్‌(మ్యూజిషీయన్‌)గా సూపర్బ్‌గా నటించాడు విజయ్‌. మరోసారి ప్రేమకథతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. కొన్ని సన్నివేశాల్లో అర్జున్‌ రెడ్డిని గుర్తుకుతెచ్చినా సీనయ్య క్యారెక్టర్‌లో ఇరగదీశాడు. సినిమాకు మరో ప్లస్‌ పాయిం్ రాశీ ఖన్నా. యామిని పాత్రలో ఒదిగిపోయింది. విజయ్‌తో పోటీ పడి నటించింది. మిగితాపాత్రల్లో ప్రియదర్శి, ఐశ్వర్య రాజేష్,కేథరిన్,ఇజా బెల్లి వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ స్క్రీన్ ప్లే,మ్యూజిక్,సెకండాఫ్,క్లైమాక్స్. సినిమాలో ఏదో మిస్సైన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కొంచెం స్లో, డల్ అయిన భావన కలుగుతుంది. క్లైమాక్స్ మరో వీక్ పాయింట్ గా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. విజయ్ క్రేజ్‌కు తగ్గట్లుగా లవ్‌స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు క్రాంతి మాధవ్. కథ, సెకండాఫ్‌పై మరింత దృష్టిపెడితే బాగుండేది. ఇక గోపి సుందర్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. కేఎస్ రామారావు నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

Image result for world famous lover

తీర్పు:

మూడు పాత్రల ఆధారంగా ఓ అందమైన లవ్‌స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు క్రాంతి మాధవ్. అయితే ఆ మూడు పాత్రలను స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడంలో అంత సక్సెస్ కాలేదనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం ఎమోషనల్‌ సీన్స్‌తో నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌ను రోటిన్‌గా తెరకెక్కించాడు. క్లైమాక్స్‌ కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే విజయ్ నటన,సీనయ్య-సువర్ణ పాత్రలు సినిమాకే హైలైట్‌గా నిలవగా ఓవరాల్‌గా ఓ సారి చూడదగ్గ చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్‌.

విడుదల తేదీ: 14|02|2020
రేటింగ్: 2.75/5
నటీనటులు: విజయ్ దేవరకొండ,రాశీఖన్నా,ఐశ్వర్య రాజేశ్
సంగీతం:గోపి సుందర్
నిర్మాత:కేఎస్ రామారావు
దర్శఖత్వం:క్రాంతి మాధవ్

- Advertisement -