దేశానికే ఆదర్శంగా తెలంగాణ పట్టణాలు: కేటీఆర్

241
ktr

దేశానికే ఆదర్శంగా తెలంగాణ పట్టణాలు నిలవనున్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్. ఎంసీహెచ్‌ఆర్‌డీలో కొత్త పురపాలక చట్టంపై కలెక్టర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ రూపాయి లంచం లేకుండా 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాలని చెప్పారు.

మున్సిపల్ చట్టం అమలులో నిర్లక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీఎస్ బీపాస్ చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. పనిచేయని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

పట్టణ ప్రగతిని పకడ్బందిగా అమలు చేస్తే పట్టణాల ప్రగతి పథంలో నడుస్తాయని చెప్పారు. రేపటి నుంచి మూడు రోజుల్లో వార్డు కమిటీలను ఏర్పాటుచేయాలని..వార్డు కమిటీల్లో రాజకీయాలు చేయొద్దన్నారు. రూపాయి లంచం లేకుండా ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని చెప్పారు. అధికారులంతా ఈ ఆఫీస్ ఏర్పాటుచేసుకోవాలన్నారు. పట్టణ ప్రగతి కోసం పనిచేసే వాహనాలకు స్టిక్కర్‌లను వేయాలన్నారు.