వరంగల్‌కు మంత్రి కేటీఆర్

41
- Advertisement -

మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్వతగిరి మండలం ఏనుగల్లులో ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు.

అలాగే మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో మహిళా దినోత్సవ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు మొత్తం రూ.750 కోట్ల వడ్డీలేని రుణాలను, అభయహస్తం డబ్బులను చెక్కుల రూపంలో పంపిణీ చేయనున్నారు. 500 మందికి ఉచితంగా కుట్టుమిషన్లు అందిచనున్నారు.

తర్వాత తొర్రూరు పట్టణంలో రూ.2కోట్ల13లక్షలతో నిర్మించిన యతిరాజారావు చిల్డ్రన్స్‌పార్‌, రూ.4కోట్లతో నిర్మించిన సమీకృత మారెట్‌ యార్డును మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. రూ.8కోట్ల75లక్షలతో నిర్మించే ఇండోర్‌ స్టేడియం, డివైడర్‌ పనులకు శంకుస్థాపన చేస్తారు. యతిరాజారావు పార్క్‌ ఆవరణలో రూ.5కోట్లతో ఇండోర్‌ స్టేడియం, ప్రస్తుతం ఉన్న గ్రోమోర్‌ కేంద్ర సమీపం నుంచి పాలకేంద్రం వరకు డివైడర్‌ కోసం రూ.2.75కోట్లు కేటాయించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -