బంగారం కొనుగోలుదారులకు శుభవార్త..

40
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇవాళ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 మేర ధర తగ్గి రూ.51,650కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.56,350కి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.56,500గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.51,800కి చేరాయి.

బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.3000 పెరిగి రూ.70 వేల మార్కును తాకింది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.600 తగ్గి రూ.70 వేల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 1810 డాలర్ల వద్ద ఉండగా.. ఇక స్పాట్ సిల్వర్ మాత్రం భారీగా పడిపోయింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -