పురుషాధిక్యత కలిగిన భారత క్రికెట్ రంగంలో తమదైన శైలిలో సత్తా చాటిన భారత మహిళ క్రికెటర్‌లు. వీళ్లు 2022వ సంవత్సరానికిగాను అనేక మైలురాలు అందుకున్నారు. 2022లో మార్చి-ఏప్రిల్‌లో జరిగిన ప్రపంచకప్‌లో భారత సత్తా చాటలేకపోయింది. సెమీస్ బెర్త్‌ను కూడా చేరుకోలేకపోయింది. ఈ టోర్నమెంట్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడితే కేవలం మూడింటిలో విజయం సాధించి ఆరు పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచి సంవత్సర ఆరంభంలో తీవ్ర నిరాశ మిగిల్చారు.
2022 జూలై-ఆగస్టులో జరిగిన బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 9పరుగుల తేడాతో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నారు. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడటం ఇదే మొదటి సారి కావడం విశేషం. మరియు ఈ టోర్నీలో రేణుకా సింగ్ 11వికెట్లు తీసి ఆగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లీష్ గడ్డపై తొలిసారిగా ODIలో 3-0తో విజయం సాధించారు. అంతేకాదు వచ్చే యేడాది బీసీసీఐ భారత్‌లో మహిళఐపీఎల్ కూడా ప్రారంభించనున్నారు.
ఈ యేడాదిలో సాధించిన ఘనతలో మరోటి ఆసియా కప్. పురుషుల ఆసియా కప్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కానీ వుమెన్ బ్లూ టీం మాత్రం ఆద్భుతమైన ఆటతీరుతో ఆసియా కప్‌ను సాధించింది. ఫైనల్‌లో శ్రీలంకపై గెలిచి భారత్ ఏడవ సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఈ సిరీస్‌లో దీప్తి శర్మ 13 వికెట్లతో టాప్‌లో నిలవగా, జెమియా రోడ్రిగ్స్ 217పరుగులతో టాప్‌స్కోరర్ గా నిలిచింది. దీప్తి శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకుంది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) వారు పురుషులతో పాటుగా మహిళ క్రికెటర్లకు సమాన మ్యాచ్ ఫీజును ప్రకటించింది. దీంతో వారు ఆడే ప్రతి మ్యాచ్‌కు పురుషులతో పాటుగా సమాన మ్యాచ్ ఫీజును ఈ యేడాది నుంచి తీసుకోనున్నారు. దీంతో లింగ అసమానతను అంతం చేసినట్టుగా బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.
ఈ యేడాదిలో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన వాళ్లలో మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి ఉన్నారు. వారి రెండు దశాబ్దాల క్రీడ చరిత్రలో మిథాలీ అన్ని ఫార్మాట్లలో 10,000 పరుగులను చేసి రిటైర్ అయ్యారు. ఝులన్ గోస్వామి కూడా అన్ని ఫార్మట్లలో 355వికెట్లు తీసింది. తాప్సిపన్నూ హీరోయిన్‌గా షెభాష్ మిథాలీ అనే బయోపిక్ సినిమా వచ్చింది. ఝులన్ గోస్వామి క్రికెట్ జీవితాధారంగా అనుష్కశర్మ చక్డా ఎక్స్‌ప్రెస్ అనే సినిమాలో నటిస్తుంది. ఇది త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది.
ఈ యేడాది అధ్భుతమైన ఆటతీరు కనబరిచిన ఆటగాళ్లు….
వుమెన్ ఇన్ బ్లూ (వన్డే)
- హర్మన్‌ప్రీత్ కౌర్ (17 మ్యాచ్‌లలో 58.00 సగటుతో 754 పరుగులు, రెండు సెంచరీలు మరియు ఐదు అర్ధసెంచరీలతో)
- స్మృతి మంధాన (15 ఇన్నింగ్స్‌లలో 49.71 సగటుతో 696, ఒక సెంచరీ మరియు ఆరు అర్ధసెంచరీలతో)
- మిథాలీ రాజ్ (12 ఇన్నింగ్స్‌ల్లో 41.40 సగటుతో 414 పరుగులు, ఐదు అర్ధసెంచరీలతో)
- రాజేశ్వరి గైక్వాడ్ (24 వికెట్లు)
- దీప్తి శర్మ (22 వికెట్లు)
- రేణుకా సింగ్ (18 వికెట్లు)
వుమెన్ ఇన్ బ్లూ (టీ20)
- స్మృతి మంధాన (21 ఇన్నింగ్స్‌ల్లో 33.00 సగటుతో 594 పరుగులు, ఐదు అర్ధసెంచరీలతో)
- షఫాలీ వర్మ (23 ఇన్నింగ్స్‌ల్లో 23.65 సగటుతో 544 పరుగులు, రెండు అర్ధసెంచరీలతో)
- హర్మన్‌ప్రీత్ కౌర్ (20 ఇన్నింగ్స్‌ల్లో 32.75 వద్ద 524, రెండు అర్ధసెంచరీలతో)
- దీప్తి శర్మ (29 వికెట్లు)
- రేణుకా సింగ్ (22 వికెట్లు)
- స్నేహ్ రాణా (19 వికెట్లు)
ఇవి కూడా చదవండి…
వార్నర్..డబుల్ సెంచరీ
ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలానికి బీసీసీఐ…
అందరి మ్యాచ్ ఫీజు సమానం