ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో వయసు, లింగ భేదంతో సంబంధం లేకుండా ఆడిక్ట్ అయ్యే విషయం ఏదైనా ఉందంటే.. అది పోర్న్ అని చెప్పక తప్పదు. స్మార్ట్ ఫోన్ ఎంట్రీతో జనాలకు ఈ పోర్న్ మరింత దగ్గరైంది. అయితే ఇదివరకు మగవారు మాత్రమే చూసే ఈ పోర్న్ పిచ్చి.. ఆడవాళ్లకు కూడా పట్టుకుందట. 2017 ఫిబ్రవరి నెల వరకు నమోదైన గణాంకాల ప్రకారం ఓ పోర్న్ వెబ్‌సైట్ వెల్లడించిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు… ఇలా డివైస్ ఏదైనప్పటికీ వాటిల్లో అశ్లీల చిత్రాలను చూస్తున్న మహిళల శాతం 80గా ఉంది. పురుషులకైతే ఇది 69 శాతంగా ఉంది. అంటే పురుషుల కన్నా 11 శాతం ఎక్కువ మంది మహిళలు పోర్న్ వీడియోలు చూస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే ఇదే రేటు యూకేలో ఇంకా ఎక్కువగా ఉంది.
అక్కడ 86 శాతం మంది మహిళలు పోర్న్ వీడియోలు చూస్తున్నారట. వీరిలో 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సున్నవారు అత్యధికంగా ఫోన్లు, ట్యాబ్లెట్ల ద్వారా అశ్లీల చిత్రాలు చూస్తుండగా, వయస్సు పెరుగుతున్నకొద్దీ కంప్యూటర్‌లో పోర్న్ వీడియోలను చూసే వారు పెరుగుతుండడం గమనించదగిన విషయం. అశ్లీల చిత్రాలను చూస్తున్న మొత్తం మహిళల్లో కేవలం 28 శాతం మంది మాత్రమే కంప్యూటర్లలో చూస్తుండగా.. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లలో పోర్న్ వీడియోలను చూస్తున్న వారే ఎక్కువ కావడం విశేషం.