క‌లికాలం.. విద్యార్థిని లేపుకుపోయిన‌ లేడీ టీచ‌ర్..

288
Woman teacher ‘elopes’ with 15-year-old student,
- Advertisement -

క‌లికాలం అంటే ఇదేనేమో బ‌హుశా..? విద్యార్థుల‌కు విద్యాబుద్ధులు నేర్పాంచాల్సిన ఓ టీచ‌ర్ ప్రేమ పాఠాలు నేర్పింది. ఆ విద్యార్థిపై మ‌న‌సు పారేసుకున్న టీచర్, ప్రేమ‌లోకి దింపి ఆ విద్యార్థిని లేవ‌దీసుకుపోయింది. మ‌నవాత్వానికి మ‌చ్చ తెచ్చే ఈ ఘ‌ట‌న చంఢీగ‌ర్ రాష్ట్రం ఫ‌తేబాద్ లో జ‌రిగింది.

పోలీసుల క‌థ‌నం ప్రకారం ఫతేబాద్ ప్రైవేట్ పాఠ‌శాల‌లో ఓ విద్యార్థి 10వ త‌ర‌గ‌తి చదువుతున్నాడు. ఇక ఆ విద్యార్థుల‌కు విద్యను బోధించే ఓ 29 ఏళ్ల టీచ‌ర్ ఆ 15 ఏళ్ల‌ విద్యార్థిపై మ‌న‌సు పారేసుకుంది. విద్యార్థికి ఫోన్ కొనిచ్చింది. క్ర‌మంగా మాట్లాడడం, చాటింగ్ లు చేసుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఆ టీచ‌ర్ పైన‌ల్ గా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఆ విద్యార్థిని పెళ్లి చేసుకోవాల‌ని ఫిక్స్ అయ్యింది.

Woman teacher ‘elopes’ with 15-year-old student,

ఓ రోజు పాఠ‌శాల‌లో ఇటు టీచ‌ర్, అటు విద్యార్థి ఇద్ద‌రు క‌నిపించ‌క పోవ‌డంతో ఇద్ద‌రి ఇళ్ల‌కు వెళ్లి పాఠ‌శాల ప్రిన్స్ పాల్ వివ‌రాలు సేక‌రించాడు. ప్రిన్స్ ఊహించిన‌ట్లుగానే టీచ‌ర్, ఆ విద్యార్థి ఇద్ద‌రు లేచిపోయారు. త‌న కొడుకు క‌నిపించ‌డం లేద‌ని మ‌రోవైపు విద్యార్థి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేస్ గా పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు

టీచ‌ర్ ఆ విద్యార్థిని లేవ‌దీసుకుపోయింద‌ని తెలుసుని వెత‌క‌ట‌డం మొద‌లు పెట్టారు. కానీ ఆ తెలివిగ‌ల టీచ‌ర్ త‌న మొబైల్ ని ఇంట్లోనే వ‌దిలేసి వెళ్లింది. విద్యార్థి పోన్ సిగ్న‌ల్ ఆధారంగా టీచ‌ర్ ని అరెస్టు చేశారు. అయితే ఇద్ద‌రు క‌లిసి ముందుగా ఫ‌తేపూర్ నుంచి హిసార్ అటు నుంచి ఢిల్లీ వెళ్లారు. అనంత‌రం క‌మ్మూకశ్మీర్ కి వెళ్ల‌గా అక్క‌డ ఇద్ద‌రని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న టీచర్ ని విచారించ‌గా.. తానే విద్యార్థిని తీసుకువెళ్లిన‌ట్లు ఒప్పుకుంది.

- Advertisement -