కేటీఆర్‌కు ఉత్తమ్ విషెస్

487
ktr birthday
- Advertisement -

తండ్రి తగ్గ తనయుడిగా బంగారు తెలంగాణ సాధన కోసం అహర్నిషలు శ్రమిస్తున్న మంత్రి కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సినీ,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు. కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఉత్తమ్ ట్వీట్ చేశారు. ఉత్తమ్ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

అన్నయ్య కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ఎంపీ కవిత…సూపర్ హీరో అంటూ కొనియాడింది. మంత్రి హరీష్ రావు సైతం ట్వీట్టర్ ద్వారా పుట్టినరోజు గ్రీటింగ్స్ తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ బాల్క సుమన్,బీబీ పాటిల్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ రాములు నాయక్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కేటీఆర్‌కు విషెస్ తెలిపారు.

- Advertisement -