మై గాడ్‌..జస్ట్‌ మిస్‌..!! వీడియో

253
Woman Nearly Crushed Under Truck
- Advertisement -

భూమ్మీద ఇంకా నూకలు మిగిలున్నాయ్‌ అంటే ఇదేనేమో..! చావు అంచుల్లోకి వెళ్ళిన ఓ మహిళ తృటిలో ప్రాణాలతో బయటపడింది. అదికూడా డ్రైవర్‌ చాకచక్యంతో. వివరాల్లోకి వెళితే.. చైనాలో  ఓ మహిళ రోడ్డు దాటుతుండగా.. ఒక వాహనం అతివేగంతో దూసుకువచ్చింది.

ఆవిడ కాళ్లు.. ట్రక్కు ముందు టైర్లకు తగిలాయి. దీంతో 180 డిగ్రీల కోణంలో తిరిగిన ఆ మహిళ తల వెనుక టైర్ల కింద పడింది. తక్షణమే అప్రమత్తమైన డ్రైవర్ బ్రేక్ వేశాడు. సరిగ్గా ఆమె తలకు ఇంచు దూరంలో వాహనం ఆగిపోయింది.

అనంతరం డ్రైవర్ వాహనం దిగి.. ట్రక్కు కిందిభాగం నుంచి ఆమెను బయటకు లాగేశాడు. ఆ మహిళకు పెద్దగా గాయాలు కాకపోవడంతో డ్రైవర్ ఊపిరిపీల్చుకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే..రోడ్డు దాటేముందు ఆ మహిళ …వాహనాలను గమనించకుండా హడావిడిగా రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. వీడియోలో అది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ డ్రైవర్‌ అప్రమత్తంగా లేకపోయుంటే ఆ మహిళ  ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. సో రోడ్డు దాటేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే ..విలువైన ప్రాణాలను కాపాడుకోగలం.

 

- Advertisement -