దేశచరిత్రలోనే తొలిసారి..ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మహిళా ఎస్ఐ

142
priyanka si
- Advertisement -

దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. ఇప్పటివరకు ఎన్‌కౌంటర్‌లు,ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అనగానే గుర్తుకొచ్చేది మగ పోలీసులు. తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను ప్రాణాలకు ఎదురించి ఎన్‌కౌంటర్ చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఒక్క మహిళా పోలీస్ కూడా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న చరిత్రలేదు. కానీ ఇప్పుడు ఆలోటు కూడా తీరిపోయింది.

దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు ఓ మహిళా ఎస్ఐ . 2008వ సంవత్సరంలో ఢిల్లీ పోలీసు క్రైంబ్రాంచ్ లో ఎస్ఐగా చేరిన ప్రియాంక ప్రగతి మైదానంలో జరిగిన ఎన్‌కౌంటరులో పాల్గొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్ స్టర్ రోహిత్ చౌదరి, అతని సహచరుడు పర్వీన్ అలియాస్ టిటును మహిళా ఎస్ఐ ప్రియాంక అరెస్టు చేశారు.

గ్యాంగ్ స్టర్లు మహిళా ఎస్ఐ ప్రియాంకపై కాల్పులు జరపగా, అది ఆమె బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కు తగిలింది. దీంతో ఆమెకు ఎటువంటి హాని జరగలేదు. గ్యాంగ్ స్టర్లకు రూ.5లక్షల రివార్డు ఉందని తెలిపిన పోలీసులు…ఎన్‌కౌంటరులో పాల్గొన్న మహిళా ఎస్ఐ ప్రియాంకను అభినందించారు.

- Advertisement -