పురుషులకే కరోనా ముప్పు..!

99
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. రోజుకు 500 వరకు కేసులు నమోదవుతుండగా తాజాగా రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది వైద్య,ఆరోగ్య శాఖ. పురుషులకే కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని…జన సమూహాల్లోకి ఎక్కువగా వెళ్లడం, ఉపాధి, ఉద్యోగాల్లో వీరి సంఖ్య అధికంగా ఉండటంతో పురుషుల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు వెల్లడించింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 3.05 లక్షల కరోనా కేసులు నమోదు కాగా అందులో 60.63 శాతం మంది పురుషులు, 39.37 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది.గురువారం 57,548 మందికి పరీక్షలు చేయగా, 518 మందికి కరోనా సోకినట్లు తేలిందని ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

రాష్ట్రంలో గత 24 గంటల్లో 495 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,804కి చేరగా ఇందులో 2,99,878 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,241 కేసులు యాక్టివ్ గా ఉండగా 1685 మంది కరోనాతో మృతిచెందారు.

- Advertisement -