యుఎస్‌ కరోనా ఎఫెక్ట్..8 కోట్ల ఉద్యోగాలు ఉఫ్‌..!

254
us
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ప్రపంచంలో అత్యధిక కేసులు ఉన్న దేశంగా అమెరికా చరిత్రకెక్కగా కరోనా మరణాల సంఖ్య కూడా ఆ దేశంలోనే అధికం. కరోనా ఎఫెక్ట్‌తో ఇండస్ట్రీలు మూతపడ్డాయి…. హోటల్స్, రెస్టారెంట్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకు అమెరికాలో 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు అమెరికన్ ఫర్ టాక్స్ పెయిర్ నెస్, ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ సంస్థ సర్వేలో తేలింది.

ఇప్పటివరకు అమెరికాలో 3.2 మిలియన్ల కేసులు నమోదుకాగా 5 లక్షల 48 వేల మంది మృతిచెందారు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అత్యధికంగా కాలిఫోర్నియాలో 3.66 మిలియన్ల కేసులు నమోదుకాగా 58,594 మంది మృతిచెందారు.

- Advertisement -