దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత జట్టు ప్రదర్శనపై ‘దాదా’ సంతృప్తి వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్‌లో వారు చాలా బాగా ఆడారని కితాబిచ్చాడు. నేడు జరగనున్న చివరి టీ20ని గెలుచుకుని సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. పొట్టి క్రికెట్ టీ20 లేకుంటే క్రికెట్ బతికిబట్టకట్టం అసాధ్యమని పేర్కొన్నాడు. క్రికెట్ బతకాలంటే టీ20లు తప్పనిసరి అని, అది లేకుంటే క్రికెట్‌కు భవిష్యత్ లేదని తేల్చిచెప్పాడు.
ప్రస్తుతం జట్టులో ఉన్న మనీష్ పాండే, హార్ధిక్ పాండ్యా లాంటి యువ ఆటగాళ్లు ఎదగడానికి సమయం ఇవ్వాలని గంగూలీ పేర్కొన్నాడు. వన్డే, టీ20ల్లో ధోనీ చక్కగా ఆడుతున్నాడని, అయితే మునుపటి ధోనీని చూడడం ఇక కష్టమేనని తేల్చి చెప్పాడు. ధోనీ ఆడడాన్ని గౌరవంగా మాత్రమే చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. మహిళా క్రికెటర్లతో పోల్చినప్పుడు పురుషుల జట్టే మెరుగైనదని గంగూలీ స్పష్టం చేశాడు.
క్రికెట్‌లో అవినీతిని రూపుమాపి దేశంలో ఈ క్రీడను మరింత అభివృద్ధి చేసేందుకు సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోదా కమిటీ సిఫారసులను రాష్ట్రాల్లో అమలు చేయాలంటే.. కొన్ని నిర్మాణాత్మక ప్రతిబంధకాలు ఉన్నాయని తెలిపాడు దాదా.