వరల్డ్ వ్యాక్సిన్‌ కేపిటల్‌గా హైదరాబాద్‌…

241
ktr
- Advertisement -

ప్రపంచానికి వ్యాక్సిన్ కేపిటల్‌గా హైదరాబాద్‌ను మారుస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హెచ్‌ఐసీసీలో మూడో రోజు బయో ఏషియా సదస్సుకు కేంద్రమంత్రి సురేష్ ప్రభుతో హాజరైన కేటీఆర్ డిజెట్‌లో పాల్గొన్నారు.ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని అన్నారు. జీడీపీ కంటే ఫార్మ అభివృద్ది తగ్గిందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ఫార్మా పరిశ్రమ అనుహ్యంగా అభివృద్ది చెందుతుందన్నారు కేంద్రమంత్రి సురేష్ ప్రభు.  ఫార్మా రంగం అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ చొరవ ప్రశంసనీయమని అన్నారు. చాలా దేశాలు ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు.ప్రజల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో ఫార్మా కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని కేంద్రమంత్రి గుర్తు చేశారు. గత ఇరవై ఏళ్లలో భారత్‌లో పరిశ్రమలు ఎంతో అభివృద్ధి సాధించాయని తెలిపారు.

ktr

బిజినెస్-టు-బిజినెస్ (బీ టు బీ) సమావేశాల్లో 50కి పైగా దేశాల నుంచి 1200 మందికి పైగా పాల్గొన్నారు. సుమారు వందమంది ప్రముఖులు సంగిచనున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే ప్రతిష్ఠాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఈ ఏడాది స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మిచెల్-ఎన్-హాల్ ఎంపికయ్యారు.

- Advertisement -