మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ…

314
ktr birthday
- Advertisement -

తెలంగాణ ఐటీ పరిశ్రమలు మరియు మునిసిపల్ శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కె .తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సహచర మంత్రులు, పెద్దఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ నాయకులతో పాటు పలువురు క్రీడా, సినిమా స్టార్ లతోపాటు పారిశ్రామికవేత్తలు సైతం మంత్రి కేటీఆర్ కి ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరియు పలువురు ఇతర సినీనటులు పారిశ్రామికవేత్తలు మంత్రి కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

తెలంగాణ క్యాబినెట్ మంత్రులు హరీష్ రావు,ఈటల రాజేందర్ ,సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ గంగుల కమలాకర్ మొదలైన మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.వీరితో పాటు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎంపీలు జోగినిపల్లి సంతోష్, బి బి పాటిల్ మరియు పలువురు ఎమ్మెల్యేలు సైతం మంత్రి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలువురు మంత్రులు నాయకులు ప్రజా ప్రతినిధులు సైతం మంత్రి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి , సుజనా చౌదరి, సీఎం రమేష్, రజిని వో, రోజా సెల్వమణి, మార్గా ని భరత్ రామ్, పేర్ని నాని, గంటా శ్రీనివాసరావు, భూమా అఖిల రెడ్డి మొదలైనవారు మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన నాయకుల్లో ఉన్నారు.

క్రీడా ప్రముఖులు వి.వి.ఎస్.లక్ష్మణ్, సైనా నెహ్వాల్, ప్రజ్ఞాన్ ఓజా, సిక్కిరెడ్డి, సుమిత్ రెడ్డి లాంటి క్రీడా ప్రముఖులు సైతం మంత్రి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

సినీ రంగానికి చెందిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్ దగ్గుబాటి, రామ్ చరణ్, రానా, నాని, ప్రకాష్రాజ్, నితిన్, మంచు మనోజ్, లక్ష్మీ మంచు, సుధీర్ బాబు, లావణ్య త్రిపాటి ,హరీష్ శంకర్ ,రాహుల్ సిప్లిగంజ్, ఎస్.ఎస్.తమన్ లాంటి ప్రముఖులు మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

పారిశ్రామిక రంగానికి చెందిన పలువురు ఈరోజు మంత్రి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టెక్ మహీంద్రా సి ఈ వో సిపి గుర్నని, నాస్కామ్ అధ్యక్షులు దెబ్ జాని ఘోష్, వెంచర్ క్యాపిటల్ లిస్ట్ వాణి కోలా లాంటి వారు మంత్రికి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్ మన్ మరియు యునైటెడ్ కింగ్డమ్ డెప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సైతం మంత్రి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -