మంత్రి కేటీఆర్‌కు అరుదైన గిఫ్ట్‌ ఇచ్చిన ఉప్పల శ్రీనివాస్

238
ktr
- Advertisement -

మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఓ అపురూపమైన కానుకను అందించారు.

కేటీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, పొలిటికల్ కెరియర్, విజయాలు, ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలు, ప్రజలకోసం చేసిన పోరాటాలు, హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ చేసిన కృషిని వివరిస్తున్న దృశ్య మాలికలతో ఉప్పల శ్రీనివాస్ ఓ పెయింటింగ్ ను వేయించారు.

సామాజిక అంశాలపై పెయింటింగ్స్ వేసే కందుకూరి వెంకటేశ్ తో అద్భుతమైన దృశ్య రూపం గీయించారు. ఈ భారీ చిత్రంలో కేసీఆర్ లాంతర్ తో ధైర్యంగా నడుస్తుంటే వెనకాలే కేటీఆర్ నవ్వుతూ నడుస్తున్నట్టు, అంధకారం నుండి వెలుగులను కేటీఆర్ చూస్తున్నట్టు, మెట్రో పరుగులు, ఐటీ హంగుల మేళవింపు, ఇన్స్పిరేషన్, విజన్, అకౌంటబులిటీ అనే పదాలతో చిత్రీకరించారు.

ఈ చిత్రాన్ని ఉప్పల శ్రీనివాస్ గుప్త తన కుమారులు, సాయికిరణ్, సాయితేజ, చిత్రకారుడు వెంకటేశ్ తో కలిసి ప్రగతి భవన్ లో అందించారు. అనంతరం కొద్దిసేపు ముచ్చటించారు. తన పట్ల చూపిస్తున్న అభిమానానికి కేటీఆర్ ఉప్పల శ్రీనివాస్ ను అభినందించారు.

- Advertisement -