టీఆర్ఎస్‌ ఓడితే రాజకీయ సన్యాసం:కేటీఆర్

223
ktr
- Advertisement -

టీఆర్ఎస్ ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ప్రెస్‌ క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌లో మాట్లాడిన కేటీఆర్ తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదన్నారు. టీఆర్ఎస్ వంద సీట్లలో గెలుస్తుందని..మరో 15 ఏళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలని అందరూ కొరుకుంటున్నారని చెప్పారు.

కేసీఆర్ దయ వల్ల తాను మంత్రినయ్యానని ఈ పదవే తనకు పెద్దదన్నారు. సీఎం కావాలన్న దురాశ తనకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. కేసీఆర్ మంచి ఉద్యమకారుడే కాదు మంచి పరిపాలకుడని నిరూపించుకున్నారని చెప్పారు.

టీడీపీవి అవకాశవాద రాజకీయాలన్నీ ఏ పార్టీనైతే బంగాళాఖాతంలో కలిపేయాలనే ఎన్టీఆర్ ఆశించారో ఇప్పుడు అదే పార్టీతో ఇప్పుడు టీడీపీ పొత్తు పెట్టుకుందని కేటీఆర్ అన్నారు. విభజన సమయంలో తలెత్తిన అనుమానాలు నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో నివృత్తి అయ్యాయని తెలిపారు.

కేసీఆర్‌కు తెలియకుండానే నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానన్నారు. ఆదాయాన్ని పెంచి.. పేదలకు పంచాలనేదే తమ లక్ష్యమని అన్నారు. తమకు బీజేపీతో ఎలాంటి చీకటి ఒప్పందం లేదని రాష్ట్రం నుండి బీజేపీని తరిమికొట్టడమే లక్ష్యమన్నారు.

- Advertisement -