మానవత్వమా.. నీవెక్కడ?..ఆస్తి కోసం ఇంత దారుణమా?

32
- Advertisement -

రోడ్డు మీద శవం బోతాంటే భుజం పట్టే సంస్కృతి మనది.. సచ్చిపోయినోళ్ల కాళ్లకి దండం పెట్టి పెద్దలను చేసే సాంప్రదాయం మనది.. ఆకలైతాందని అడుక్కునేటొళ్లస్తే అన్నం పెట్టే భోళా చేయి మనది.. దూపయితాందని నీళ్లడిగితే అంబలి పోసిచ్చి అరుగుమీద గూసుండమనే మంచితనం మనది. మైసమ్మకు ఏటను కోస్తం.. పోశమ్మకు కోడిని కోస్తం.. మరి ఏమైంది ఈ మనుషులకు.. ఎందుకిట్ల మారిపోయారు. మనిషిని మనిషి కానని రోజులు ఎందుకు వచ్చినయి. మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ అందెశ్రీ రాసిన పాటలు అక్షర సత్యాల్లా కళ్లముందు కనిపిస్తున్నాయి.

రానురాను మానవ సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. మనుషుల్లో మానవత్వం స్థానంలో మనీతత్వం పెరిగిపోతోంది. అందుకే ఈ మధ్య కాలంలో చాలామంది చెబుతుంటారు..నాకు హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లుఉన్నాయి..ఎయిర్ పోర్టును ఆనుకునే నాలుగు ఫ్లాట్లున్నాయి అంటుంటారు. అవి ఎక్కడైనా ఉండని ఫ్లాట్లు ఉంటాయి కానీ నువు ఉండవు.

విచిత్రం ఏంటంటే మనిషికి ఎక్కడ ఏం సంపాదించుకోవాలో తెలియని అంధత్వం నెలకొంది. అందుకే ఆస్తుల కోసం గొడవపడతారు, కొట్టుకుంటారు, కేసులంటారు, చంపుకుంటారు. చివరికి అన్నదమ్ముల్ల మధ్య,అక్కాచెల్లెల్ల మధ్య,తండ్రి కోడుకుల మధ్య ఆస్తుల తగాదాలకు చేరింది క్రూరత్వం.

భూతగాదాలతో ఈ రోజు సమాజం ఎంతదారుణంగా ఉందో మనం చూస్తున్నాం..ఎంతమంది ఒక్క గజం స్థలం కోసం అన్నను చంపిన లేదా తమ్ముడిని చంపిన అన్నలు లేరు. అడుగైతే సంపాదించుకోగలం కానీ కొల్పోయిన వారిని తిరిగి తీసుకురాగాలమా. ఎందుకు చంపావు తల్లిని, ఎందుకు చంపావు తండ్రిని అంటే ఆస్తి కోసం, ఆస్తి అయితే వస్తుంది కానీ పొయిన తల్లి,తండ్రులు తిరిగి వస్తారా?

బంధాలన్ని కమర్షియల్, మనీ మ్యాటర్ అయిపోయాయి..ఇక్కడ నీకు ఎన్ని ఉండనీ అన్ని వదిలేస్తావు.. ఏమీ తీసుకెళ్లవు. మన ముందటి తరాలు ఏం తీసుకుపోయారు అంటే ఏం చెబుతాం తెలియని పరిస్థితి. అందరు మన కళ్ల ముందు అన్ని వదిలి వెళ్లిపోతుంటే వాటి కోసం ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్. ఆలోచించండి ఆస్తి అయితే వస్తుంది కానీ నా అనుకున్న వారిని కొల్పోతే జీవితమే వ్యర్థం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -