హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ విస్తరణ…

74
- Advertisement -

16వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో 3డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని 2022లో ప్రకటించిన మైక్రోసాఫ్ట్‌ కొత్తగా మరో 3డేటా సెంటర్లను ప్రారంభిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్టుబడుల అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్టు తెలియజేసింది. దీంతో మొత్తం 6డేటా సెంటర్లను 100మెగావాట్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.

రాబోయే 10-15సంవత్సర కాలంలో ఈ ఆరు డేటా సెంటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ స్థాయి క్లౌడింగ్‌ సెవలను అందించడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్‌ భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతుందని తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మైక్రోసాఫ్ట్ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న బంధం మరింత బలోపెతం అవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్ అడాప్షన్ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తో కలిసి పని చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు డేటాసెంటర్ లు హైదరాబాద్ లోనే కేంద్రీకృతం కావడం ఎంతో సంతోషకరం అన్నారు. తెలంగాణ కేంద్రంగా మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్ లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్ సంస్థకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ నగరం మైక్రోసాఫ్ట్ అనుబంధం అద్భుతంగా కొనసాగుతుందన్నారు. మైక్రోసాఫ్ట్‌ ఆసియా హెడ్‌ అహ్మద్ మజారీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ అన్ని మార్కెట్‌లో హైదరాబాద్ కీలకమన్నారు. ఇండియా కేంద్రంగా మైక్రోసాఫ్ట్ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే డేటాసెంటర్ లు అత్యంత కీలకంగా మారుతాయన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇవి కూడా చదవండి…

150కోట్లతో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌..

కంటివెలుగు దేశవ్యాప్తంగా విస్తరణ..

కేంద్రం సహకరించకున్నా తెలంగాణ టాప్‌..

- Advertisement -