బాలయ్య సినిమాలో అతను కూడా

80
- Advertisement -

హరీష్ గుర్తున్నాడా.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా గ్లామర్ బాయ్ గుర్తొస్తాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 280 సినిమాల్లో నటించాడు హరీష్. హిస్టరీ పెద్దగా ఉన్న.. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. నిలబడటానికి హరీష్ చాలా సినిమాలు చేసినప్పటికీ మళ్లీ తెలుగులో నిలబడే స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అలా కొన్ని సినిమాలు చేసి, ఆ తర్వాత పూర్తిగా తెలుగు పరిశ్రమకు దూరమయ్యాడు హరీష్. ప్రస్తుతం హరీష్ ఓ మలయాళ మూవీలో నటిస్తున్నాడు.

ఐతే, హరీష్ కి చాలా గ్యాప్ తర్వాత మరో మంచి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఓ పెద్ద సినిమాలో కీలక పాత్ర కోసం హరీష్ పేరును పరిశీలిస్తున్నారు. బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమా ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్ర కోసం హీరో సత్యదేవ్ ను అనుకుంటున్నారు. ఐతే.. సత్యదేవ్ పక్కన మరో కీలక పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం హరీష్ పేరును పరిశీలిస్తున్నారు. ఇది ఒక కామెడీ క్యారెక్టర్ అని తెలుస్తోంది.

ఏభై ఏళ్ళు వచ్చినా మంచి గ్లామర్ ను మెయింటైన్ చేస్తూ.. వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ నిత్య పెళ్లి కొడుకుగా టైమ్ పాస్ చేసే క్యారెక్టర్ అట ఇది. ఇలాంటి క్యారెక్టర్ కి హరీష్ బాగా సూట్ అవుతాడు అని అనిల్ రావిపూడి హరీష్ కి ఛాన్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో కీలక పాత్రల కోసం క్యారెక్టర్ ఆర్టిస్టుల డిమాండ్ చాలా ఉంది. పాత తరం నటీనటుల్ని వెతికి మరీ తమ సినిమాల్లోకి తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే హరీష్ కి కూడా ఇప్పుడు ఛాన్స్ వచ్చింది.

ఇవి కూడా చదవండి…

జబర్ధస్త్‌ రాకేష్ సుజాతల పెళ్లి ఫిక్స్‌

ఓటీటీ : ఈ వారం కంటెంట్

మళ్లీ తల్లి కాబోతుందా?

- Advertisement -