TDP:’మేనిఫెస్టో ‘ పై సస్పెన్స్?

12
- Advertisement -

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి వైసీపీ, టీడీపీ పార్టీలు. ఇక త్వరలోనే ఈ రెండు పార్టీల నుంచి మేనిఫెస్టోలు బయటకు రానున్నాయి. గత కొన్ని రోజులుగా మేనిఫెస్టోల విషయంలో ఈ రెండు పార్టీలు సస్పెన్స్ మెంటైన్ చేస్తున్నాయి. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో కొన్ని హామీలను ప్రకటించి వాటినే బలంగా ప్రజల్లోకి తీసుకెల్లే ప్రయత్నం చేస్తోంది, అయితే టీడీపీతో పాటు జనసేన, బీజేపీ పార్టీలు పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ రెండు పార్టీలకు సంబంధించిన హామీలను కూడా కలుపుకొని ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు కూటమికి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోపై ఎలాంటి సమాచారం లేదు. .

అసలు మేనిఫెస్టో ప్రకటన ఎప్పుడు జరగబోతుంది ? అనే దానిపై కూడా క్లారిటీ లేదు. అటు వైసీపీ కూడా ఇదే తరహాలో మేనిఫెస్టోపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఎన్నికల సమయంలో దాదాపు రెండు నెలల ముందు నుంచే మేనిఫెస్టోను బలంగా తీసుకెళ్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈసారి మాత్రం మేనిఫెస్టోపై ఇంకా కసరత్తులు చేస్తూనే ఉంది. ఇప్పటికే విడుదల చేయాల్సిన మేనిఫెస్టోను అనివార్య కారణాల వల్ల పలు మార్లు వాయిదా వేస్తూ వచ్చింది పార్టీ అధిష్టానం. అయితే మేనిఫెస్టో ప్రకటన కొంత ఆలస్యమైనప్పటికి అన్నీ వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా జగన్ మేనిఫెస్టో రూపొందిస్తునట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

వీలైనంత త్వరలోనే మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకొచ్చేలా జగన్ ప్లాన్ చేస్తున్నారట. అయితే అటు కూటమి పార్టీలుగాని ఇటు వైసీపీ గాని మేనిఫెస్టోను పెండింగ్ లో ఉంచడానికి కారణం.. ముందు వైసీపీ మేనిఫెస్టోను బట్టి తమ మేనిఫెస్టోలో మార్పులు చేసి విడుదల చేయాలని కూటమి భావిస్తుంటే.. కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత తమ మేనిఫెస్టో విడుదల చేసి క్రియర్ డిఫరెన్స్ చూపాలనేది వైసీపీ ప్లాన్. ఇలా ఇరు పక్షాలు కూడా మేనిఫెస్టోపై సస్పెన్స్ కొనసాగిస్తున్నాయి. మరి ఈ సస్పెన్స్ కు ఎప్పుడు తెర దించుతారో చూడాలి.

Also Read:వెంకటేష్ -దిల్ రాజు..ప్రొడక్షన్ నెం 58

- Advertisement -