- Advertisement -
వాట్సప్ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన యాప్. ఇండియాలో ఛాటింగ్ కోసం ఎక్కువ మంది వాడుతున్న యాప్ కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న యాప్ ఇది. అయితే వాట్సఫ్ వినియోగదారులు కొంత మందికి ఇది చేదు వార్త. 2020 జనవరి 1 నుంచి కొన్ని ఫోన్లలో వాట్సప్ పనిచేయదు. విండోస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లలో రేపటి నుంచి వాట్సప్ పనిచేయదు.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ పాత వర్షన్ ఉన్న ఫోన్లల్లో 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్ సేవలు నిలిచిపోతాయి. . ఇక మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి వాట్సాప్ యాప్‌ను తొలగించనున్నట్లు కూడా వాట్సాప్ తెలిపింది. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఆండ్రాయిడ్ 2.3.7 కన్నా తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే మీ ఫోన్‌లో వాట్సప్ పనిచేయదు. ఈ ఫోన్లు వాడుతున్న వారు అందరూ తమ ఫోన్లను మార్చుకోవాలని సూచించారు.
- Advertisement -