ఆధార్, పాన్ కార్డ్ లింక్..కేంద్రం కీలక నిర్ణయం

486
pan_card_aadhar
- Advertisement -

పాన్ , ఆధార్ కార్డ్ లింక్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా డెడ్ లైన్ విధిస్తూ వస్తుంది. డిసెంబర్ 31 చివరి తేది అంటూ డెడ్ లైన్ విధించింది కేంద్ర. అయితే తాజాగా ఈ డెడ్ లైన్ ను మార్చి 31కి పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్చి 31లోపు దేశ వ్యాప్తంగా అందరూ పాన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ ప్రకటనను విడుదల చేసింది.

దీంతో ఇప్పటి వరకూ చేయలేదని టెన్షన్ పడే వారికి కాస్త ఊరట లభించింది. డిసెంబర్ 31లోపు పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు రద్దు అవుతుందని తెలిపారు అధికారులు. కొంత మంది చేసినప్పటికీ ఇంకా చాలా మంది మిగిలిపోయినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో ఈ గడువు మరో మూడు నెలలు పెంచుతున్నట్టు వెల్లడించారు. కాగా, ఇలా పొడిగించడం ఇది 8వ సారి కావడం విశేషం.

- Advertisement -