Whatsapp:అదిరే ఫీచర్

30
- Advertisement -

స్మార్ట్ అరచేతిలోకి వచ్చిన తరువాత ప్రతిదీ కూడా సులభతరం అయింది. ఎలాంటి సమాచారం అయిన కూడా ఒక్క స్మార్ట్ ఫోన్ ఉపయోగించి సులభంగా తెలుసుకుంటున్నాము. ఇక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సాప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న…మరో అదిరే ఫీచర్‌తో వచ్చేసింది.

వాట్సాప్ వాయిస్ చాట్ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ప్రత్యేకమైన ఫీచర్ ఇప్పటికే బీటా వర్షన్లో రెడీగా ఉంది. దీని ద్వారా ఒకేసారి 32 మంది వ్యక్తులు ఉండే గ్రూపులలో యాక్టివ్ వాయిస్ చాట్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. మీరు ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌ను వాడుతుంటే, ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

Also Read:Tirumala:సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్యం

కొత్త బీటా వర్షన్‌కి యాక్సెస్ ఉన్న యూజర్లు గ్రూప్ చాట్స్‌లలో వేవ్‌ఫార్మ్ సింబల్‌ని చూడొచ్చు. ఈ ఫీచర్ గ్రూపులోని ఇతరులకు అందుబాటులో ఉన్నా కూడా మీరు మాత్రమే ఈ సింబల్‌ను చూడగలరు. వాయిస్ చాట్‌ని ప్రారంభించడానికి మీరు వేవ్‌ఫార్మ్ సింబల్‌ని నొక్కొచ్చు. ఇది ప్రత్యేక వాయిస్ చాట్ ఇంటర్ ఫేస్‌కు యాక్సెస్‌ను ఇస్తుంది. ఈ గ్రూపులో ఎవరైనా గరిష్టంగా 32 మంది వరకు, అంతరాయం లేకుండా వాయిస్ ద్వారా మాట్లాడొచ్చు.

అలాగే వాట్సాప్ కొత్త వీడియో మెసెజ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ వీడియో మెసెజెస్ ద్వారా చాట్‌కు రిప్లై ఇవ్వడానికి కూడా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ కనిపెట్టింది. ఇందులో 60 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను ఈ విధంగా పంపొచ్చు.

Also Read:కడుపులో నులిపురుగులా.. ఇలా చేయండి!

- Advertisement -