చిరు కొరటాల మూవీలో రెజీనా

272
chiranjeevi Dance With Regina

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈమూవీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. రామ్ చరణ్ తో పాటు కొరటాల శివ మిత్రుడు ఈసినిమాను నిర్మించనున్నారు. సోషియా ఫాంట‌సీగా దేవాదాయ శాఖలో జ‌రిగిన అవినీతి నేప‌థ్యంలో రూపొంద‌నున్నట్లు తెలుస్తుంది. ఇక ఈమూవీలో చిరంజీవి సరసన త్రిషను తీసుకున్నట్లు తెలుస్తుంది.

త్వరలోనే ఈవిషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా ఈమూవీలో ఒక ఐటెం సాంగ్ పెట్టబోతున్నట్టు సమాచారం. ఐటెం సాంగ్ కోసం టాలీవుడ్ హీరోయిన్ రెజీనా ను తీసుకున్నట్లు తెలుస్తుంది. రెజీనా.. చేతిలో సినిమాలు లేకపోవడంతో ఈ ఐటెం పాటకు ఓకే చెప్పినట్టు సమాచారం. పైగా అందులో చిరంజీవి కావడంతో రెజినా వెంటనే ఒప్పేసుకుందని సమాచారం. ఆలయ భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారిపై హీరో ఎలాంటి ఉక్కుపాదం మోపాడు. దేవాలయ ఆస్తులను కాపాడడానికి హీరో ఏం చేసాడు అనేదానిపై సినిమా తెరకెక్కునుందని తెలుస్తుంది.