TDP:కడపలో టీడీపీ పరిస్థితేంటి?

26
- Advertisement -

ప్రస్తుతం కడప రాజకీయాలు ఏపీలో పోలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఎందుకంటే వైఎస్ కుటుంబంలో తలెత్తిన విభేదాల కారణంగా అక్కడ షర్మిల వర్శస్ జగన్ ఎపిసోడ్ నడుస్తోంది. కడప ఎంపీ స్థానానికి వైసీపీ తరుపున మళ్ళీ అవినాష్ రెడ్డికే జగన్ టికెట్ కేటాయించగా.. అవినాష్ కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరుపున షర్మిల పోటీ చేయనున్నారు. దీంతో ఈ సొంతింటి పోరులో ఎవరు గెలుస్తారనే దానిపై యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే షర్మిల మరియు అవినాష్ రెడ్డి ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి హంతకుడని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటే.. ఇలాంటి వ్యాఖ్యలు విచక్షణ రహితమని అవినాష్ రెడ్డి షర్మిలపై ఫైర్ అవుతున్నాడు. .

ఇలా కడప పోలిటికల్ వేడి తారస్థాయిలో కొనసాగుతోంది. ఇదిలా ఉంచితే వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉండే కడప ఎంపీ స్థానంలో ఈసారి ఇద్దరు వైఎస్ కుటుంబం నుంచి పోటీలో ఉండడంతో ఇక్కడ ఇతర పార్టీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ. అందుకే కడప సీటుపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కడప నుంచి టీడీపీ తరుపున చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఇక్కడ టీడీపీ గెలిచే పరిస్థితులు లేకపోవడంతో పరోక్షంగా వైఎస్ షర్మిలకు మద్దతిచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట.

భూపేష్ రెడ్డిని నామమాత్రంగా పోటీలో ఉంచుతూ షర్మిలా గెలుపు కోసం పాటు పడేలా బాబు వ్యూహరచన చేసినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కడప సీటును టీడీపీ లైట్ తీసుకుంటే ఆ వార్తలకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. మరి ఎలాంటి రాజకీయ పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకునే చంద్రబాబు కడప విషయంలో ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

Also Read:Allu Arjun: హ్యాపీ బర్త్ డే బన్నీ

- Advertisement -