చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 25

291
HISTORICAL
- Advertisement -

*:చరిత్రలో ఈ రోజు డిసెంబరు 25*

 *సుపరిపాలన దినోత్సవం*

*ఏసు క్రీస్తు పుట్టిన రోజు.* *దీనిని క్రిస్ట్మస్ గా క్రైస్తవులు జరుపుకుంటారు*.

 *సంఘటనలు*

2000: రూ.60వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన గ్రామీణ రహదారుల పథకం, అంత్యోదయ అన్న పథకాలను అప్పటి ప్రధాని వాజ్పేయి ప్రారంభించారు.

2007: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి మూడవసారి ప్రమాణస్వీకారం.

 *జననాలు*

1861 : భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త, భారతరత్న మదన్ మోహన్ మాలవ్యా జననం (మ.1946)

1901: తుమ్మల సీతారామమూర్తి , ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు
[మ.1990]

1910: కల్లూరి తులశమ్మ , ప్రముఖ సంఘసేవకురాలు మరియు ఖాదీ ఉద్యమ నాయకురాలు. (మ.2001)

1924: అటల్ బిహారీ వాజపేయి, పూర్వ భారత ప్రధానమంత్రి.

1917: ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కవయిత్రి, పరిశోధకురాలు మరియు గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996)

1927: రాం నారాయణ్ , ప్రఖ్యాత హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుడు.

1933: పటేల్ అనంతయ్య , ఉర్దూ అకాడెమీ “తెలుగు – ఉర్దూ నిఘంటువు” ప్రాజెక్టుకు డైరెక్టర్గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.

1936: ఇస్మాయిల్ మర్చెంట్ , భారత దేశంలో జన్మించిన సినీ నిర్మాత, సుదీర్ఘ కాలంలో మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా బాగా సుపరిచితుడు.

1876: భారత్ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటుచేసిన నాయకుడు ముహమ్మద్ అలీ జిన్నా (మ.1948).

 *మరణాలు*

1977 : విషాదం నేపథ్యంలో నవ్వులు పండించిన హాస్యనటుడు చార్లీచాప్లిన్ మరణం (జ.1889).

1846: స్వాతి తిరునాళ్ , కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు మరియు రచయిత. (జ.1813)

1970: దాడి గోవిందరాజులు నాయుడు , తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (జ.1909)

1972: చక్రవర్తి రాజగోపాలాచారి , భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (జ.1878)

1988: మోదుకూరి జాన్సన్ , సుప్రసిద్ధ నటులు, నాటక కర్త. (జ.1936)

1997: జోస్యం జనార్దనశాస్త్రి , అభినవ వేమన బిరుదాంకితుడు మరియు అష్టావధాని (జ.1911)

1998: పెనుమర్తి విశ్వనాథశాస్త్రి , ప్రముఖ తెలుగు వచన కవితా ప్రవీణులు.

2011: ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు. (జ.1930

- Advertisement -