బండ్ల గణేష్ సంచలన నిర్ణయం

104
- Advertisement -

తన రాజకీయ భవిష్యత్ గురించి బాంబు పేల్చారు నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్. కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ఆయన… పాలిటిక్స్ కి గుడ్ బై చేప్పారు. ఎమోషనల్ అవుతూ.. ట్వీట్ చేశారు.

నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు. .అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్.. అంటూ రాసుకొచ్చారు.

 

ఇవి కూడా చదవండి

రాబోయే రోజుల్లో అత్యధికంగా చలి

తెలంగాణ గ్రూప్‌1 ప్రాథమిక కీ రిలీజ్‌

ఆ పీహెచ్‌డీ డిగ్రీలకు ఆనుమతి లేదు:యూజీసీ, ఏఐసీటీఈ

- Advertisement -