గ్యారంటీ స్కీంలను ఆపే ప్రసక్తేలేదు!

0
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు గ్యారంటీ పథకాలను నిలిపివేసే ప్రసక్తే లేదని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ పథకాలు ఆగిపోతాయంటూ ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఎక్స్‌లో పోస్ట్ చేసిన సిద్దరామయ్య… బీజేపీ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి మరియు ప్రభుత్వంపై బురద చల్లడానికి నిరంతరం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఈ గ్యారంటీ పథకాలకు తగినన్ని నిధులు కేటాయించామని వీటిని విజయవంతంగా కొనసాగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

నిరుపేదలు, మహిళలు, యువత సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఈ పథకాలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోందని సిద్ధరామయ్య విమర్శించారు. గ్యారంటీల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అవుతుందంటూ గతంలో చేసిన విమర్శలు అబద్ధాలని కాలమే నిరూపించిందని ఆయన గుర్తు చేశారు. కర్ణాటకలోని కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకాల ద్వారా నిరంతరాయంగా ప్రయోజనం చేకూరుతుందని ఏ ఒక్క పథకాన్ని కూడా రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

Also Read:తనపై జరిగిన దాడి..విన్యాసమే:అభిజిత్

రాష్ట్రంలోని సామాన్య ప్రజల ఆర్థికాభివృద్ధికి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ ఐదు గ్యారంటీలు ఎంతగానో దోహదపడుతున్నాయని, తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సిద్ధరామయ్య ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -