సింగపూర్‌లో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సీబీఎన్ @361 డిగ్రీస్ పుస్తకం ఘనంగా ఆవిష్కృతమైంది. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆతిథ్యంలో జరిగిన ఈ వేడుకలో పుస్తకం తొలిప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే,రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు అందుకున్నారు.
ఈ గ్రంథాన్ని ‘రేపటికోసం’ దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో, కీలక సందర్భాలలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను ఆయన ఇందులో సూక్ష్మంగా విశ్లేషించారు. అంతర్జాతీయ పాఠకులకు సైతం ఈ విషయాలు చేరాలనే ఉద్దేశంతో విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ దీనిని ఆంగ్లంలోకి అద్భుతంగా అనువదించారు.
ఏపీ రెరా మాజీ చైర్మన్ రామనాథ్ వ్యక్తపరిచిన వ్యక్తిగత అనుభవాల ద్వారా… బాహ్య ప్రపంచానికి ఇంతవరకు తెలియని అనేక ఆసక్తికరమైన అంశాలు ఈ పుస్తకం ద్వారా మొదటిసారి వెలుగుచూశాయి.
Also Read:తనపై జరిగిన దాడి..విన్యాసమే:అభిజిత్

