కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఫ్రెంచ్ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు భారత్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకోవాలని ఆహ్వానించారు. ఫ్రాన్స్‌లో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ 2026 కార్యక్రమంలో మాట్లాడుతూ….భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని, డిజైన్ చేయాలని, ఆవిష్కరణలు చేపట్టాలని, తయారీ రంగంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
భారత్ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని పేర్కొన్న గోయల్….దేశంలో భారీ ప్రతిభావంతుల మానవ వనరులు, విస్తారమైన మార్కెట్, తయారీ సామర్థ్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఫ్రెంచ్ సంస్థలు భారతదేశాన్ని తమ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మార్చుకుని….దేశీయ మార్కెట్‌తో పాటు ప్రపంచ మార్కెట్లకు కూడా ఎగుమతులు చేయవచ్చని చెప్పారు.
Also Read:తనపై జరిగిన దాడి..విన్యాసమే:అభిజిత్
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు పెరుగుతున్న సమయంలో భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధికి కొత్త అవకాశాలు సృష్టిస్తోందని గోయల్ పేర్కొన్నారు. భారత్‌లో ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయని, ప్రపంచ వృద్ధికి దేశం నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తోందని ఆయన వివరించారు.

