వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ ?

40
- Advertisement -

ఆర్ఆర్ఆర్‌’తో గ్లోబల్ స్టార్‌ గా మారిపోయిన జూ.ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమా చేయబోతున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా ఈ మూవీ 2025 జ‌న‌వ‌రి 24న రిలీజ్ కానున్నట్టు స‌మాచారం. 2024 ఆరంభంలో వార్ 2 రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా మొదటి నుంచి ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలని ఆశ పడ్డారు.

ఇక హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య జరిగే పోరాటంగా వార్ 2 రూపొందించనున్నారని తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ తో గత 5 నెలలుగా చర్చలు జరిపారు. ఎన్టీఆర్ ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత.. తన మిత్రుడు కొరటాల శివను కూడా స్క్రిప్ట్ లో ఇన్ వాల్వ్ చేసి.. తన పాత్ర పై పూర్తి క్లారిటీ తర్వాతే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మార్చిలోనే వార్ 2 ఓకే అయింది. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉండనుంది.

Also Read: Rajinikanth:మంచి మిత్రుడిని కోల్పోయా

ఈ సినిమాకు జూ.ఎన్టీఆర్ సౌత్ రైట్స్ తీసుకోనున్నాడు. మొత్తానికి హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి నటిస్తే.. ఆ కిక్కే వేరు. ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్స్ గా హృతిక్ కి – ఎన్టీఆర్ కి పేరు ఉంది. అలాంటి వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే.. కచ్చితంగా పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవుతుంది. పైగా హృతిక్‌ తో క‌లిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటే.. ఎన్టీఆర్‌కు గ్రాండ్ గా బాలీవుడ్ ఎంట్రీ ద‌క్కినట్టే. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాలను నమోదు చేస్తోందో చూడాలి.

Also Read: డింపుల్ హాయతి కేసులో అసలు నిజాలు

- Advertisement -